దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మవిభూషణ్ రతన్ టాటా మరణంతో భారత్ విలువ కట్టలేని రత్నాన్ని కోల్పోయిందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణంపై సంతాపం తెలుపుతూ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ రతన్ టాటా మరణంతో భారతీయులు తీవ్ర విచారంలో ముగినిపోయారన్నారు.