ఇసుక వినియోగదారులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఉచిత ఇసుకను పొందాలని ప. గో. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇసుక అందుబాటులో లేనందున తూ. గో. జిల్లా తిపర్రు- 2 & 3, ఔరంగాబాద్ రీచ్‌ల ద్వారా ఇసుకను పొందేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే తిపర్రులో రూ. 96. 02, ఔరంగాబాద్‌లో రూ. 229 చెల్లించాల్సి ఉందని, దీనికి రవాణా ఛార్జీలు అదనం అన్నారు.