పెనుమంట్ర మండలంలోని ఏడు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలను యుటిఎఫ్ తదితర సంఘాల ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి బొర్రా గోపి మూర్తి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని పాఠశాలల ఉపాధ్యాయులను కోరారు. ఈ సందర్భంగా గోపీమూర్తి మాట్లాడారు. షేక్ సాబ్జీ ఆశయాలను కొనసాగిస్తానని, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గానికి, ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తానని తెలిపారు.