పెనుమంట్ర మండలం మార్టేరు నుంచి పాలకొల్లు వెళ్లే ప్రధాన రహదారి విస్తరణ పనులను మంగళవారం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రహదారిని ఆనుకుని ఉన్న పలు దుకాణాలను, ఇతర అడ్డంకులను కాళీ చేయించారు. ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ పర్యవేక్షణలో రహదారి విస్తరణ పనులను నిర్వహిస్తున్నట్లు, విస్తరణ పనులకు అనుసంధానంగా రహదారి మరమ్మత్తులు చేపడతామని స్థానిక కూటమి నాయకులు వెల్లడించారు