తుని పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి 18 మంది పోలీస్ సిబ్బంది బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళుతున్నట్లు పట్టణ సీఐ గీతారామకృష్ణ మీడియాకు తెలియజేశారు. ఐదు సంవత్సరాలుగా తుని పట్టణంలో విశేష సేవలందించిన సిబ్బందిని ఘనంగా పట్టణ సీఐ గీతారామకృష్ణ శుక్రవారం రాత్రి ఘనంగా సత్కరించారు. బదిలీ అయిన వారిలో ఇద్దరు ఏఎస్ఐలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్, 13 మంది కానిస్టేబుల్స్ ఉన్నట్లుగా తెలియజేశారు.