అయ్యప్ప స్వాములకు ఉచిత అన్నదాన ప్రసాద వితరణ శుక్రవారం నుంచి పునః ప్రారంభించారు. తుని పట్టణంలోని కైలాసగిరి కాట్రాళ్ల కొండపై వెలసిన అయ్యప్ప స్వామి ఆలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం యువనేత దాడిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. 64 రోజులు అన్న ప్రసాద వితరణ ఉంటుందన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 రెండు గంటల వరకు ప్రసాద వితరణ జరుగుతుందన్నారు.