ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన రైతు నేస్తం పథకంలో 14 మంది రైతులకు.. కోటి రూపాయలు రుణాలుగా అందించామని మామిడికుదురులోని నగరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పర్సన్ ఇంఛార్జి గుబ్బల మురళి సత్యనారాయణ తెలిపారు. సొసైటీ కార్యాలయంలో శుక్రవారం మహా జనసభ జరిగింది. సంఘంలో 1059 మంది సభ్యులు ఉన్నారని, వారిలో 629 మందికి రూ. 4. 60 కోట్లు స్వల్ప కాలిక రుణాలుగా, 92 మందికి రూ. 2. 03 కోట్లు దీర్ఘకాలిక రుణాలుగా అందించామన్నారు.