గత వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీలకు సరఫరా చేసే పౌష్టికాహారంలో నాణ్యత ఉండేది కాదని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి ఆరోపించారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నియోజవర్గంలో సరైన రోడ్ల సదుపాయాలు లేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. గిరిజనులకు విలువ లేని భూముల ఆధారంగా వైసీపీ ప్రభుత్వం రేషన్ కార్డులను తొలగించిందని దీనిపై దృష్టి పెట్టాలని కోరారు.