రాజమండ్రిలో నిబంధనలకు విరుద్ధంగా మోటార్ బైకులకు పొగ గొట్టాలను ఏర్పాటు చేసుకుని ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ సౌండ్ పొల్యూషన్‌కు పాల్పడుతున్న బైక్‌లపై ట్రాఫిక్ పోలీసులు శనివారం చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సీఐ మహమ్మద్ నబీ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. బైక్ కంపెనీ నిబంధనలతో వచ్చే బైక్ సైలెన్సర్లను మార్చినా, అమ్మినా ఆ షాపులపై చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.