రాజమండ్రిలోని పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్శిటీ, ప్రభుత్వ సంస్థలను నగరం నుంచి తరలించేస్తున్నారని తూ. గో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టి. కె విశ్వేశ్వర రెడ్డి ఎంపీ, ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. వేద పాఠశాలను సంస్కృత కళాశాల స్థలంలో ఏర్పాటు చేయాలన్నారు. అలాగే నగరంలో నీటి పన్ను కట్టే ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీరు డిమాండ్ చేసే హక్కు ఉందన్నారు.