ఆదివారం రాజమండ్రిలోని బొల్లినేని కిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న సత్యనారాయణ అనే వ్యక్తికి బి-పాజిటివ్ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉండగా మన బాధ్యత ఫౌండేషన్ ని సంప్రదించడం జరిగింది. సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్ మేనేజర్ ప్రకాష్ కు విషయాన్ని తెలియజేయగా వెంటనే స్పందించి 14 సార్లు బి పాజిటివ్ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ డోనేట్ చేసిన వీరబాబు ద్వారా ప్లేట్లెట్స్ సేకరించి పేషేంట్ కి అందించడం జరిగింది. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ మేనేజర్ ప్రకాష్ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం అయిన ఎంతోమంది పేషేంట్లకు సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్ ద్వారా సకాలంలో బ్లడ్ అందిస్తున్నాం అని, ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేస్తే రక్త కొరత తగ్గుతుంది అని తెలియజేసారు. ఈ సందర్భంగా దాత వీరబాబుని పలువురు అభినందించారు.