ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో రాజమండ్రి స్మార్ట్ ఎమర్జెన్సీ హాస్పటల్లో చికిత్స పొందుతున్న లక్ష్మీ కాంతం అనే మహిళ కొరకు సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉన్నది.మన బాధ్యత ఫౌండేషన్ ని సంప్రదించగా, సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్ మేనేజర్ ప్రకాష్ కు సమాచారం అందించడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి 28 సార్లు సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ దానం చేసిన శ్రీనివాస్ అనే యువకుడి ద్వారా ప్లేట్లెట్స్ సేకరించి పేషేంట్ కి అందించడం జరిగింది. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ మేనేజర్ ప్రకాష్ మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం అయిన ఎంతోమంది పేషేంట్లకు సంజీవని బ్లడ్ బ్యాంక్ ద్వారా సకాలంలో బ్లడ్ అందిస్తున్నాం అని, ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేస్తే రక్త కొరత తగ్గుతుంది అని తెలియజేసారు. ఈ సందర్భంగా దాత శ్రీనివాస్ ని పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో మన బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షుడు గారా అజయ్ కుమార్, కసిరెడ్డి శాంతి కుమారి, కిరణ్ సంజీవని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
Where: రాజమండ్రి
When: 9-4-2023 10:00 PM
Additional info: రక్తదానం చేయడం మన బాధ్యత