గురువారం రావులపాలెంలోని దుర్గావతి హాస్పటల్లో చికిత్స పొందుతున్న షేక్ కరీమున్నీసా అనే ప్రెగ్నెంట్ లేడి సర్జరీ కొరకు అత్యవసరంగా అరుదైన ఎ బి-నెగిటివ్ గ్రూప్ రక్తం అవసరం అయితే మన బాధ్యత ఫౌండేషన్ ని సంప్రదించగా, రాజమండ్రికి చెందిన గారా శేఖర్ వెంటనే స్పందించి రాజమండ్రి సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్లో రక్తదానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా రక్తదాతను పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో మన బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షుడు గారా అజయ్ కుమార్, సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్ మేనేజర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.