తూర్పుగోదావరి జిల్లాలోని 113 నీటి యాజమాన్య సంఘల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్-1 విడుదల చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కాడా కమీషనర్, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ఆధారిటీ విజయవాడ వారు జారీచేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఆ మేరకు ఎన్నికలకు అనుగుణంగా జిల్లాలో 40 రోజుల పూర్తి షెడ్యూల్ని కలెక్టర్ వివరించారు.