రాజమండ్రిలోని ప్రభుత్వాసుపత్రిని శనివారం రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగుల వివరాలు అడిగి తెలుసుకొని వారికి అందించే వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన నాణ్యమైన వైద్యాన్ని అందించాలని డాక్టర్లకు సూచనలు చేశారు. అలాగే కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.