రాయవరం చాణక్య హాస్పిటల్ లో డెంగ్యూ వ్యాధికి చికిత్స పొందుతున్న తలారి కృష్ణ అనే వ్యక్తికి అత్యవసరంగా బీ పాజిటివ్ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఆదివారం మన బాధ్యత ఫౌండేషన్ ని సంప్రదించగా, సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్ మేనేజర్ ప్రకాష్ వెంటనే స్పందించి స్వయంగా 80 సార్లు సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ దానం చేసి ఎన్నో ప్రాణాలు రక్షించిన కోటి ద్వారా ఎస్.డీ.పీ సేకరించి పేషేంట్ కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ మేనేజర్ ప్రకాష్ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం అయిన ఎంతోమంది పేషేంట్లకు సంజీవని బ్లడ్ బ్యాంక్ ద్వారా సకాలంలో బ్లడ్ అందిస్తున్నాం అని, ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేస్తే రక్త కొరత తగ్గుతుంది అని నిర్వాహకులు తెలియజేసారు.