కాకినాడలో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తికి అత్యవసరంగా ఏబీ పాజిటివ్ రక్తం అవసరం అయితే, రాజమండ్రికి చెందిన యువకుడు సాయికృష్ణ వెంటనే స్పందించి సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్ నందు మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో డొనేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సాయికృష్ణ మాట్లాడుతూ.. ఈ నెల 29 న మన బాధ్యత ఫౌండేషన్ ప్రధమ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్-20 నుండి 29 వరకు పది రోజుల పాటూ అందరూ మంచి పనులు/కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్ మేనేజర్ ప్రకాశ్, సిబ్బంది, మన బాధ్యత ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.