మన బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షుడు గారా అజయ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రక్తదాతలు స్వచ్చంధంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా గారా అజయ్ కుమార్ మాట్లాడుతూ ఆపదలో ఉండి రక్తం అవసరం అయిన వాళ్ళకి సకాలంలో రక్తాన్ని అందించే సంకల్పంలో భాగంగా మన బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతీనెలా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్న రక్తదాతలకు కృతజ్ఞతలు తెలిపి, సర్టిఫికెట్లు అందించారు. ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేస్తే రక్త కొరత తగ్గి అనేక ప్రాణాలు రక్షించవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మన బాధ్యత ఫౌండేషన్ సభ్యులు గారా శ్రీవిధ్య, గారా జ్యోష్ణ, కోవగాని రమేష్ సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్ మేనేజర్ ప్రకాష్, బీరా రాజు, ప్రసాద్, కిరణ్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.