పిఠాపురంలో జరిగిన 16 ఏళ్ల బాలిక అత్యాచార ఘటనపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ స్పందించారు. బాధితురాలి ఇంటికి వెళ్ళి తల్లి తండ్రులను పరామర్శించిన వర్మ ఈ దారుణానికి పాల్పడిన వారు ఏ పార్టీకి చెందిన వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిందితుడు దుర్గాడ జాన్ అనే వ్యక్తిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు. బాధితురాలికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.