కాకినాడ కు చెందిన 23 సంవత్సరాల యువతి గొల్లప్రోలులో బంధువుల ఇంటికి వచ్చి అదృశ్యమైనట్లు ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై శుక్రవారం కేసు నమోదు చేశామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. నవంబర్ 10న గొల్లప్రోలులోని బంధువుల ఇంటికి తల్లితో కలిసి యువతి వచ్చినట్లు చెప్పారు. నవంబల్ 14న తెల్లవారుజామున యువతి అదృశ్యమైందని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నామని వివరించారు.