కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి నందు మంగళవారం అమలాపురం ఎ.ఆర్. టి. నోడల్ సెంటర్ తరఫున స్థానిక ఐసీటీసీ ఆధ్వర్యంలో హెచ్. ఐ. వి. వ్యాధితో బాధపడుతున్న రోగులకు వైరల్ లోడ్ టెస్టులు నిర్వహించారు. ఈ యొక్క రక్త పరీక్షలకు మొత్తం 33 మందికి కొత్తపేట ఎల్. ఎ. సి సెంటర్ లో ఎ.ఆర్. టి మందులు వాడే రోగులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గన్నవరపు దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.