సారా తయారు చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 15 లీటర్ల సరకు స్వాధీనం చేసుకున్నట్లు గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు తెలిపారు. గండేపల్లి మండలం కె. గోపాలపురం గ్రామ శివారులో సారా కాస్తున్న వ్యక్తిని బుధవారం అరెస్టుచేసి అతని వద్ద ఉన్న 15 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని 200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామని పేర్కొన్నారు. నిందుతుడిని కోర్టుకు హాజరపరచగా నవంబర్ 6 వరకు రిమాండ్ విధించారని తెలిపారు.