పెదపూడి ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన నరేందర్ రెడ్డిని మండలంలోని పంచాయతీ కార్యదర్శులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీడీవో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాలను పటిష్టంగా అమలు చేయాలని, గ్రామాల అభివృద్ధికి కార్యదర్శులు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈవోపిఆర్డి సత్యనారాయణ, కార్యదర్శులు మన్యం శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, ఉమామహేశ్వరరావు, ప్రసన్న, సుబ్రమణ్యం పాల్గొన్నారు.