సీఎం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో ఇక్కడి ప్రజలు తనకు ఇచ్చిన ధైర్యాన్ని మరువలేనని నారా భువనేశ్వరి అన్నారు. సోమవారం రాజమండ్రిలోని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవ సభలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. ఆ 53 రోజులపాటు తనకు, తన కుటుంబానికి ఇక్కడి ప్రజలు ఆశ్రయం కల్పించారని, తనను ఓ తోబుట్టువులా చూసుకున్నారని అన్నారు.