రాజమండ్రి నగర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలోని 11వ డివిజన్లో ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లో నెలకొన్న డ్రైనేజీ, రోడ్లు తదితర సమస్యలను పరిశీలించారు. వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.