ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా రాజమండ్రికి చెందిన జనసేన రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూపాదేవి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ ఆటోనగర్‌లోని ఏపీ టూరిజం కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు పార్టీ అధిష్టానం అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తానని చెప్పారు.