సీఎం చంద్రబాబు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాజకీయాలకు వాడుకుంటున్నారని అందుకు భవిష్యత్తులో కచ్చితంగా మూల్యం చెల్లించుకోకతప్పదని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన ఆరోపణలో నిజాలు నిగ్గుతేలాలని డిమాండ్ చేశారు. అందుకోసం అత్యున్నతస్థాయి దర్యాప్తు అవసరమని స్పష్టం చేశారు.