రాజమండ్రి: అందుబాటులో కూరగాయలు ఉండేలా పర్యవేక్షణ అవసరం
ప్రజలకు నిత్యవసర వస్తువులు, కూరగాయలు అందుబాటులో ఉండేలాగా అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ చేపట్టాలని తూ. గో జిల్లా జేసీ ఎస్. చిన్న రాముడు ఆదేశించారు. మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ధరల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు అధికంగా ఉన్నాయని వాటిని నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక కార్యచరణ రూపొందించాలన్నారు.