స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో మంగళవారం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అనంతరం గ్రామంలో ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.