ప్లాస్టిక్ బ్యాగులు స్వాధీనం
నిడదవోలు, యర్నగూడెం, కొత్తపల్లి స్వీట్స్ హోమ్ ఫుడ్స్‌ను విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. డ్రై కేక్, రాగి లడ్డూలు స్వాధీనం చేసుకున్నారు. గడువు ముగిసిన ఉత్పత్తులను గుర్తించి కేసు నమోదు చేశారు. అపరిశుభ్రమైన పరిస్థితులు మెరుగుపరచడానికి ఇంప్రూవ్మెంట్ నోటీస్ జారీ చేశారు. తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ బ్యాగులు స్వాధీనం చేసుకుని, రూ. 5 వేలు జరిమానా విధించారు.