ప్రజలకు ఇబ్బంది లేకుండా తాగునీటి సరఫరా చేయాలని కొవ్వూరు మునిసిపల్ చైర్‌పర్సన్ బావన రత్నకుమారి అన్నారు. మునిసిపాలిటీ ప్రధాన వాటర్‌వర్క్సులో 40 హెచ్‌పీ మోటారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయింది. దీంతో ఆమె పబ్లిక్ హెల్త్ డీఈ డి. సత్యనారాయణతో కలిసి గురువారం వాటర్‌వర్క్సును సందర్శించి మోటార్ కాలడానికి గల కారణాలు తెలుసుకున్నారు. శుక్రవారం పూర్తిస్థాయిలో వాటర్ సరఫరా చేస్తామని తెలిపారు.