తిరుమల ఏడు కొండలను శుక్రవారం సాయంత్రం దట్టమైన పొగమంచు కమ్మేసింది. శ్రీవారి దర్శనం తర్వాత అలా ఆలయం నుంచి బయటకు వచ్చిన వారికి పొగమంచు స్వాగతం పలికింది. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంతో భక్తులు మైమరిచిపోయారు. తమ ఫోన్లకు పనిపెట్టారు. ఇదే పొగమంచుతో ఘాట్ రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.