తిరుమల ఘాట్ రోడ్డులో అద్భుతమైన దృశ్యాలు భక్తులను, సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గురువారం ఘాట్ రోడ్డుపై నుంచి చూస్తుంటే కొండలను మంచు ఆవహించినట్లు కనిపించింది. దానిని చూసిన పర్యాటకులు మైమరచిపోయారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.