ఆదివారం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం ముదివేడు లో తెలుగు యువత నాయకుడు, ఎన్ టి ఆర్ అభిమాని ఈశ్వర్ నాయుడు సారథ్యం లో రూపొందించిన నూతన సంవత్సరం 2023 క్యాలెండర్ ను తెలుగు దేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అద్యక్షులు పి. సురేంద్ర యాదవ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ అయుబ్, పిచలవండ్ల పల్లి సర్పంచ్ సురేంద్ర , రాజంపేట పార్లమెంట్ కార్యదర్శి మోహన్ రెడ్డి, బూత్ కన్వీనర్ మదార్, ఆనంద్ రెడ్డి, ముదివెడు యువత అబ్జల్, సురేంద్ర(సచిన్), రామచంద్రా గఫూర్, తిమ్మయ్య, బయ్య రెడ్డి, నవాజ్, మరియు ముఖ్య తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.