బి. కొత్తకోట: భార్య కాపురానికి రాలేదని దాడి చేసిన భర్త
కాపురానికి రాలేదని భార్యపై భర్త దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు శనివారం బి. కొత్తకోట సిఐ రాజారెడ్డి తెలిపారు. బాలసాని పల్లెకు చెందిన రాంబాబు కు స్పందన (19) తో పెళ్లి జరిగి ఏడాది కావస్తోంది. భర్తపై కోపంతో అలిగి ఆరు నెలల క్రితం పుట్టినింటికి వెళ్లి తిరిగి రాలేదు. స్పందన ను కాపురానికి రావాలని రాంబాబు వెళ్లి పిలవగా ఆమె నిరాకరించడంతో దాడి చేసినట్లు ఆయన తెలిపారు.