తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారిసత్రం మండలం బూదూరు గ్రామం సమీపంలో మంగళవారం ఉదయం అపాచీ పరిశ్రమకు చెందిన బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బూదూరు గ్రామ సమీపంలో బస్సు వర్షానికి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40మంది కంపెనీ కార్మికులు ఉన్నారు. ఎవరికి ఏ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు.