కేవీబీ. పురం: 20 రోజులుగా రాకపోకలు కట్

74பார்த்தது
సత్యవేడు నియోజకవర్గం కె. వి. బి. పురం మండలంలోని కళత్తూరు గ్రామపంచాయతీ చెందిన కొట్టాలమిట్ట యస్. టీ. కాలనీకి 20 రోజుల నుంచి రాకపోకలు లేవని శుక్రవారం స్థానికులు తెలిపారు. ఫెంగల్ తుఫాన్ కారణంగా పెద్దకాలువ పొంగిపొర్లి రాకపోకలు నిలిచిపోయాయని చెప్పారు. అలాగే అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో రాకపోకలు కొనసాగలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు. అధికారులు స్పందించి తమకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.

தொடர்புடைய செய்தி