చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, మేలుం దొడ్డి వద్ద పేలుడు సంభవించిన క్వారీని సోమవారం సాయంత్రం పలమనేరు డి. ఎస్. పి ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లిథియం బ్యాటరీల పేలుడు కారణంగా భారీ విస్పోటం జరిగినట్లు ఆయన తెలిపారు. సమగ్ర విచారణ జరిపించి పేలుడుకు గల కారణాలను త్వరలో వెల్లడిస్తామని డి. ఎస్. పి తెలిపారు.