పుంగనూరు నియోజకవర్గం, సదుం మండల పశువైద్యాధికారిగా డాక్టర్ ప్రదీప్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన మునుపు అన్నమయ్య జిల్లా కంభంవారి పల్లెలో విధులు నిర్వహిస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. గతంలో ఇక్కడ పశు వైద్యాధికారిగా ఉన్న సుబ్రహ్మణ్యం బదిలీపై పెనుమూరుకు వెళ్లారు. పాడి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అధికారి తెలిపారు.