చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం బోయకొండ గంగమ్మ తల్లి ఆలయాన్ని గడిచిన ఐదేళ్లలో సుమారు రూ. 500 కోట్లతో అభివృద్ధి చేసినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గంగమ్మ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.