పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం కొటాల గ్రామంలో బీసీజీ వ్యాక్సినేషన్ ను సీహెచ్ లక్ష్మీనారాయణ సోమవారం తనిఖీ చేశారు. 60ఏళ్లు పైబడిన వారు, మద్యపానం, ధూమపానం అలవాట్లు ఉన్నవారు ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ఈ వ్యాక్సినేషన్ వల్ల 20%టీబీ వ్యాధి నియంత్రించవచ్చునన్నారు. బీసీజీ వ్యాక్సినేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళ ఆరోగ్య కార్యకర్త శైలజ, ఆశా కార్యకర్త కళావతి, మీరా, గ్రామస్థులు పాల్గొన్నారు.