తిరుమలలో పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ పై విశ్రాంత సుప్రీంకోర్టు కోర్టు జడ్జితో కమిటీ వేసి విచారణ జరిపించాలని రాష్ట్ర సామాజిక సమరసత ప్రముఖ్ చింతపర్తి మహేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన కలికిరిలో మాట్లాడారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ పై మాట్లాడటం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.