వర్షాల నేపథ్యంలో నగరంలో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పి నరసింహ ప్రసాద్ ఆదేశించారు. సోమవారం, కమిషనర్ పలు ప్రాంతాలను సందర్శించి మార్గ నిర్దేశం చేశారు. చిత్తూరులో గంగినేని చెరువు మొరవ కాలువను పరిశీలించి, అడ్డంకులు తొలగించాలని, ఆక్రమణలు తీసివేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు మరో మూడు రోజులు కొనసాగనున్న నేపథ్యంలో, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.