తుఫాను హెచ్చరికల నేపధ్యంలో కుప్పం కడ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కడ పీడీ వికాస్ మర్మత్ సోమవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. కంట్రోల్ రూం లో ఇద్దరు అధికారులను నియమించామని, అత్యవసర పరిస్థితులలో ప్రజలు 9700762765, 7731808088 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. తుఫాన్ కారణంగా నియోజకవర్గంలో భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.