భారీ వర్ష సూచనల నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది ఎవరు సెలవు పెట్టరాదని డిఎంహెచ్ఓ ప్రభావతి దేవి బుధవారం ఆదేశించారు. కాణిపాకం పిహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. దోమ కాటు వలన ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఇంటింటా సర్వే నిర్వహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హైరిస్క్ గర్బిణీలను గుర్తించి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.