తిరుపతి రూరల్ మండలంలో స్వర్ణముఖినది నుంచి సి. మల్లవరం పంచాయతీ మీదుగా పేరూరు చెరువుకు నీరు చేరే ప్రధాన సప్లై ఛానల్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఎమ్మెల్యే నాని ఆదేశాల మేరకు పేరూరు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నాగూరు శ్రీనువాసులు నేతృత్వంలో శనివారం తొండవాడ నుంచి సి. మల్లవరం మీదుగా వచ్చే సప్లై ఛానల్స్ ఎక్స్కవేటర్ సాయంతో పనులు చేపట్టారు. ఆక్రమణలను తొలగించి సాగునీరు కాలువల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.