చంద్రగిరిలో వృద్ధురాలి నిరసన

54பார்த்தது
చంద్రగిరిలో వృద్ధురాలి నిరసన
తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణానికి చెందిన టి. ధనమ్మ(64)కు చంద్రగిరి బాలికల స్కూల్ ఎదురుగా సర్వే నెం. 61/2లో 18అంకణాల దుకాణం ఉంది. ఇంటి పన్ను, కరెంట్ బిల్లులు ఆమె పేరుతోనే ఉన్నాయి. ఆమెకు తెలియకుండా పంచాయతీలో ఇంటి పన్ను, కరెంట్ మీటర్ మార్చుకుని తనను దుకాణం నుంచి గెట్టివేశారని ఆవేదన వ్యక్తం చేసింది. శుక్రవారం తనకు న్యాయం చేయాలని దుకాణం ఎదుట బైఠాయించి నిరసన తెలిపింది.

தொடர்புடைய செய்தி