చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం చెరువు కోన అటవి ప్రాంతంలో స్మగ్లర్లు అక్రమంగా ఎదురును తరలిస్తున్నారు. ఈ అటవీ ప్రాంతంలో ఎదురు మంచి గిరాకీ ఉండడంతో ఎదురును స్మగ్లర్లు కర్ణాటక, తమిళనాడు, తదితర రాష్ట్రాలకు లారీలలో తరలిస్తున్నారని సమాచారం. ఎదురును కూలీల ద్వారా తరలిస్తున్న దృశ్యాలు మంగళవారం కేమెరాలో రికార్డ్ అయ్యాయి. అటవీ సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.