పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేసి నిమజ్జనం చేశారు. అయితే పలు ప్రాంతాలలో చెరువులలో నీరు లేకపోవడంతో విగ్రహాలను నిమజ్జనం చేయలేక చెరువు మధ్యలో పెట్టి తిరిగి వచ్చేశారు. వాన దేవుడు కరుణించకపోవడం చెరువులలో ఈ విధంగా పెట్టి వచ్చేసామని స్థానికులు తెలిపారు. ఈ చిత్రం సోమవారం ఉదయం కనిపించింది.