ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని శాసనసభ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విదేశీ పర్యటన చేసి రాష్ట్రానికి పెట్టుబడులను పెట్టేందుకు పలు కంపెనీలను తీసుకొచ్చారన్నారు. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు ఎమ్మెల్యే జీవి తెలిపారు.